మేడారం యాత్రలో విషాదం — తల్లి, కూతురు మృతి

G Rajashekar
By -
0

 


భూపాలపల్లి జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భూపాలపల్లి జిల్లాలో హృదయ విదారకమైన ప్రమాదం చోటుచేసుకుంది. ముత్తారం మండలంలో కాటారం–మేడారం రహదారిపై భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు.

మృతులను కాగజ్‌నగర్‌కు చెందిన లక్ష్మి (45), ఆమె కుమార్తె అక్షిత (21)గా పోలీసులు గుర్తించారు. సమ్మక్క-సారలమ్మల దర్శనానికి వెళ్లే మార్గంలో ఈ దుర్ఘటన జరగడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

తల్లి–కుమార్తె కలిసి భక్తిశ్రద్ధలతో మేడారానికి బయలుదేరి, తిరిగి రాని ప్రయాణం చేయాల్సి రావడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)