EB NEWS/మణుగూరు:
మణుగూరు ఏరియాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. దుర్గా కంపెనీలో సెకండ్ షిఫ్ట్‌లో డంపర్ టైర్ మెయింటెనెన్స్ పనుల సందర్భంగా అకస్మాత్తుగా టైర్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు.
ఒకరు అక్కడికక్కడే మృతి చెందాగా, గాయపడిన వారిని వెంటనే సింగరేణి ఏరియా హాస్పిటల్, మణుగూరుకు తరలించారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి.
ఈ ఘటన విషయం తెలుసుకున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మంద నరసింహారావు, మణుగూరు ఏరియా బ్రాంచ్ సెక్రటరీ వెంకటరత్నం, నాయకులు లక్ష్మణరావు, సాయి కృష్ణ, ముజాఫర్, విజయ్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు.
గాయపడిన కార్మికులు బీహార్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق