EB NEWS/తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై అదే విధానాన్ని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఆలస్యం కాకుండా ఉండేందుకు, సంబంధిత ఏజెన్సీలకు వారం రోజుల ముందుగానే బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. జీతాల ఆలస్యంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గి, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

إرسال تعليق