బిగ్ బ్రేకింగ్ న్యూస్ ...మణుగూరు: గోదావరి లో ఇద్దరు వ్యక్తుల గల్లంతు




EB NEWS | మణుగూరు:


మణుగూరు మండలం మల్లేపల్లి ప్రాంతంలోని గోదావరి నదిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన కలకలం రేపింది. 


సంఘటన స్థలానికి చేరుకున్న మణుగూరు ఎస్సై శ్రావణ్ కుమార్ ఇతర పోలీసు సిబ్బంది.


గల్లంతైన వ్యక్తులు మణుగూరు మండలం పద్మగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. హోలీ పండుగ సందర్భంగా మల్లెపల్లి సింగరేణి వాటర్ ట్యాంక్ ప్రాంతంలో గోదావరిలో స్నానానికి దిగిన గుండి నాగేశ్వరరావు (40), పద్దం ప్రసాద్ (35) (సింగరేణి ఉద్యోగి)లు గల్లంతైనట్లు సమాచారం.


ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Post a Comment

أحدث أقدم