మేడారం భక్తులకు శుభవార్త.. స్పెషల్ బస్సులు ప్రారంభం

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మణుగూరు డిపోలో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు స్పెషల్ బస్సులను ప్రారంభించారు. మణుగూరు డిపో నుంచి 20 బస్సులు, మంగపేట నుంచి 5 బస్సులు అందుబాటులోకి తెచ్చారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

1 تعليقات

إرسال تعليق

أحدث أقدم