పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలో జరుగుతున్న 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీల్లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ క్రీడాభిమానులను ఉత్కంఠతో నిలిపింది. హర్యానా – రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఈ పోరు చివరి క్షణం వరకు ఎవరు గెలుస్తారో తేల్చలేని స్థితిలో సాగింది.
మ్యాచ్ చివరి నిమిషానికి హర్యానా జట్టు రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉండగా, అప్పటికే గెలుపు ఖాయమని భావించిన క్షణంలో రాజస్థాన్ జట్టు వ్యూహాత్మకంగా రైడ్‌కు వెళ్లింది. ఆ రైడ్‌లో రాజస్థాన్ క్రీడాకారుడు అద్భుతంగా రెండు పాయింట్లు సాధించడంతో స్కోరు సమం అయ్యింది. దీంతో ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ టైగా ముగిసింది.
చివరి నిమిషంలో జరిగిన ఈ అద్భుత మలుపు మైదానమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ప్రేక్షకులు సీట్ల నుంచి లేచి నిలబడి ఈ పోరును ఆస్వాదించారు. ఈ మ్యాచ్ కేవలం క్రీడా పోరే కాకుండా, పట్టుదల, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి ఎంత కీలకమో చాటిచెప్పింది.
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ కబడ్డీ ప్రేమికులకు మరిచిపోలేని అనుభూతిగా నిలిచింది. ఏడూళ్ల బయ్యారం క్రీడా చరిత్రలో ఈ సెమీ ఫైనల్ ప్రత్యేకంగా గుర్తుండిపోయే పోరుగా నిలవనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి