జాతీయ కబడ్డీ పోటీల్లో ఫైనల్ కు తెలంగాణ...



 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం లో జరుగుతున్న జాతీయ స్థాయి అండర్ 17 కబడ్డీ పోటీల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ రోజు జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో ఉత్తర ప్రదేశ్ తెలంగాణ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగగా చివరకు ఉత్తరప్రదేశ్ జట్టు విజయం సాధించింది. అయితే ఉత్తరప్రదేశ్ జట్టులో ఆటగాళ్లు ప్రదర్శన తెలంగాణ కోచ్ కు కొంచెం అనుమానం కలిగించడంతో అప్పీల్ చేయడం జరిగింది. ఈ అప్పీల్ లో ఉత్తరప్రదేశ్ జట్టులో నిబంధనల ప్రకారం వయస్సుకు మించిన ఆటగాళ్లు ఉన్నట్లు తేలింది. ఏది ఏమైనా చివరకు మన తెలంగాణ జట్టు ఫైనల్ కి చేరుకొనే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తూ ఉండడంతో తెలంగాణ జట్టు అభిమానులకు ఆశలు చిగురించాయి.

Post a Comment

కొత్తది పాతది