ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం జనసైనికులు కృషి చేయాలి

G Rajashekar
By -
0

 


గడల శ్రీనివాస్‌ను గెలిపించేందుకు సమష్టిగా పనిచేయాలి: అంకబాబు.


EB NEWS/పినపాక: 


జనసేన పార్టీ తరఫున ఉమ్మడి ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాస్‌ను గెలిపించి శాసనమండలికి పంపించేందుకు ప్రతి జనసైనికుడు కృషి చేయాలని జనసేన పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కోసని అంకబాబు అన్నారు.పినపాక మండలం, బయ్యారం క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఓటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలుసుకోవడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.

పార్టీ విధానాలు, అభ్యర్థి వివరాలను ఓటర్లకు తెలియజేస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని అంకబాబు పిలుపునిచ్చారు. ప్రతి జనసైనికుడు బాధ్యతగా పనిచేసి ఎన్నికల కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో జనసేన ఎన్నికల కోఆర్డినేటర్లు మల్లెల సాయి, బండి నరేష్, ప్రశాంత్, కార్యకర్తలు సరేష్ , కొండేరు వెంకన్న, శ్రీను (అమ్ములు),చెన్న రాంబాబు, బొగ్గుల వెంకటేష్, గోనే బాబు, పుట్టి శ్రీనివాస్, కె వెంకటేశ్వర్లు,జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఎమ్మెల్సీ ఓటర్లు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)