పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానంలో జరుగుతున్న 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు అద్భుత విజయం సాధించింది.
ఈరోజు ఉదయం జరిగిన ఫ్రీక్వార్టర్ ఫైనల్‌లో గెలుపొందిన తెలంగాణ జట్టు, వెంటనే జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో బలమైన పంజాబ్ జట్టును ఓడించి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.
మ్యాచ్ మొత్తం తెలంగాణ క్రీడాకారులు సమన్వయంతో, ధైర్యంగా ఆడుతూ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చూపించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో వారి ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ విజయంతో తెలంగాణ జట్టు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. రాబోయే సెమీ ఫైనల్‌లో కూడా ఇదే జోరు కొనసాగించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి