అండర్–17 కబడ్డీ పోటీల్లో దేవా ఆధిపత్యం

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల వేదికగా జరుగుతున్న అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు కెప్టెన్ దేవా ఆటతీరుతో సంచలనం సృష్టిస్తున్నాడు. అసాధారణ ప్రతిభతో మైదానాన్ని శాసిస్తూ, వరుస విజయాలతో అభిమానుల మనసులను గెలుచుకుంటున్న దేవా, కబడ్డీ మైదానంలో హీరోలా నిలుస్తున్నాడు. దేవా రైడ్‌కు వెళ్లగానే… స్టేడియం అంతా కేరింతలు, చప్పట్లు, నినాదాలతో దద్దరిల్లిపోతోంది. 

ఈరోజు తెలంగాణ జట్టు – ఉత్తరప్రదేశ్ జట్టు మధ్య హోరాహోరీ పోరు నడవనుండగా…

మళ్లీ దేవా మ్యాజిక్ కనిపిస్తుందా అని

అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు

Post a Comment

కొత్తది పాతది