ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్ ఇండియా అద్భుతంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో భారీగా 239 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ (84) దూకుడుగా ఆడగా, రింకూ సింగ్ (44), సూర్యకుమార్ యాదవ్ (32) పరుగులు సాధించారు.
240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాట్మెన్స్ భారత బౌలింగ్ ముందు తడబడిపోయారు. గ్లెన్ ఫిలిప్స్ (78), చాప్మన్ (39) మాత్రమే పోరాడగా, మిగతా బ్యాట్మెన్స్ విఫలమయ్యారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.
ఈ ఘన విజయంతో టీమ్ ఇండియా సిరీస్‌లో 1–0 ఆధిక్యం సాధించి, అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి