ములుగు జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతరకు సంబంధించిన అన్ని వివరాలు ఇకపై నేరుగా వాట్సాప్‌లోనే పొందవచ్చు. భక్తులు 76589 12300 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపితే సరిపోతుంది.
ఈ సేవ ద్వారా జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్ వివరాలు, వైద్య కేంద్రాల సమాచారం, స్నాన ఘట్టాలు, భద్రతా సూచనలు వంటి అనేక అవసరమైన సమాచారం తక్షణమే లభిస్తుంది.
మేడారం వెళ్లే భక్తులు ఎలాంటి సందేహాలు లేకుండా సులభంగా ప్రయాణం చేయడానికి ఈ సేవ ఎంతో ఉపయోగపడనుంది. ప్రభుత్వ తొలిసారి ప్రారంభించిన ఈ వాట్సాప్ సేవతో జాతరకు వెళ్లే వారందరికీ సమయంతో పాటు సౌకర్యం కూడా కలుగుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి