పినపాక: ఆటో డ్రైవర్‌కు అండగా అయ్యప్ప స్వాములు....

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రికొత్తగూడెం,పినపాక మండలం బయ్యారం గ్రామపంచాయతీ సాయి నగర్ కాలనీలో నివసిస్తున్న దోమల లక్ష్మణ్ అనే ఆటో డ్రైవర్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న నర్సులు గురుస్వామి పీఠం పోతిరెడ్డిపల్లి వారు మేమున్నామంటూ ముందుకు వచ్చారు.ఆదివారం పీఠం తరఫున నిరుపేద కుటుంబానికి ఆర్థిక భరోసాగా తమ వంతు సహాయంగా రూ.5,000లను అందజేశారు. చికిత్సకు తోడ్పడేలా ఇచ్చిన ఈ సహాయాన్ని లక్ష్మణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక సేవలో గురుస్వామి పీఠం చూపుతున్న ప్రజాసేవా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు.

Post a Comment

أحدث أقدم