భద్రాచలం: మునిగిపోతున్న యువకుడిని కాపాడిన డీడీఆర్ఎఫ్ సిబ్బంది

 



EB NEWS/భద్రాచలం: 


శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా అప్రమత్తమైన డీడీఆర్ఎఫ్ సిబ్బంది అతని ప్రాణాలను రక్షించారు. హైదరాబాద్కు చెందిన ఉదయ్ అనే యువకుడు శుక్రవారం గోదావరిలో స్నానం చేస్తూ నీటిలో కొట్టుకుపోయాడు.


ఈ ఘటనను గమనించిన డీడీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక ఈతగాళ్లు వెంటనే స్పందించి నీటిలోకి దిగి యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని రక్షించిన డీడీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక ఈతగాళ్లను అభినందించారు. వారి అప్రమత్తత వల్లే ఒక ప్రాణం కాపాడబడిందని పేర్కొన్నారు.


Post a Comment

أحدث أقدم