మణుగూరు: గొర్రెలపై దూసుకెళ్లిన కోళ్ల వ్యాన్… హృదయం చలించిపోయే ఘటన

G Rajashekar
By -
0

  


EB NEWS/ మణుగూరు:


మణుగూరు సీఎస్పీ సమీప ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 2:00 గంటల సమయంలో రోడ్డుపై గొర్రెలను తీసుకెళ్తుండగా, అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ గొర్రెల గుంపుపైకి దూసుకెళ్లింది.



ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. కొన్ని గొర్రెలకు కాళ్లు విరిగిపోవడంతో పాటు, పొట్టలు పగిలిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. ఆ దృశ్యాలను చూసిన ప్రయాణికులు చలించిపోయారు.


ఈ ఘటనతో గొర్రెల యజమానికి లక్షల్లో నష్టం వాటిల్లింది. తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)