సికిల్‌సెల్, తలసేమియా రోగుల కోసం రెండు రోజుల ప్రత్యేక వైద్య శిబిరాలు — కలెక్టర్ జితేష్ వి. పాటిల్

 


భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్‌సెల్, తలసేమియా దీర్ఘకాలిక రక్తవ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం నవంబర్‌ 28–29, 2025 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించడం, అవసరమైతే నిరంతర చికిత్సకు అనుసంధానం చేయడం, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశం అని కలెక్టర్ వెల్లడించారు.


వైద్య శిభిరాలు క్రింద తెలిపిన విధంగా నిర్వహించబడతాయి:


1. శుక్రవారం (28-11-2025) ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:30 నర్సాపురం రైతు వేదిక, దుమ్ముగూడెం (దేవాలయం పక్కనే, ప్రధాన రహదారి, లక్ష్మీనగరం వైపు)


2. శుక్రవారం (28-11-2025) మధ్యాహ్నం 2:00 –సాయంత్రం 6:00భద్రాచలం రైతు వేదిక (మార్కెట్ యార్డ్‌లో)


3. శనివారం (29-11-2025) ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:30అశ్వారావుపేట రైతు వేదిక(నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన) నారాయణపురం గ్రామం, అశ్వారావుపేట మండలం.


4. శనివారం (29-11-2025) మధ్యాహ్నం 2:00–సాయంత్రం 6:00 రామవరం రైతు వేదిక చుంచుపల్లి మండలం.


హైదరాబాద్‌ నుండి ప్రత్యేకంగా రానున్న నిపుణులైన వైద్యుల బృందం ఈ శిబిరాల్లో రోగుల నిర్ధారణ, వైద్య సలహాలు, అవసరమైన చికిత్స పద్ధతులు వివరించనున్నారు. సికిల్‌సెల్, తలసేమియా రోగులకు మెడికల్ కార్డుల జారీ, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు (Unique disability id) నమోదు, కౌన్సిలింగ్ సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయని కలెక్టర్ తెలిపారు.


ఇప్పటికే ఈ వ్యాధులు గుర్తించిన పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను సమీప శిబిరానికి తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్యుల సూచనలు పొందాలని కోరుతూ, రోగుల ఆరోగ్య రక్షణలో ప్రతి కుటుంబం చురుకైన పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు.

Post a Comment

أحدث أقدم