TELANGANA: డ్రైవింగ్ లైసెన్సులు, RCల పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

 



EB NEWS/హైదరాబాద్: 


వాహనదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్‌లు (DL), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లు (RC) పంపిణీని వేగవంతం చేయడానికి ‘సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ అండ్ డిస్పాచ్’ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ఈ కొత్త విధానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రంలో DL, RC కార్డులను ముద్రించి, నేరుగా వాహనదారుల ఇంటికే పోస్టు ద్వారా పంపించనున్నారు. దీంతో ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది.


ఈ నిర్ణయంతో మధ్యవర్తుల జోక్యం తగ్గి అవినీతికి చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, యూజర్ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని రవాణా శాఖకే కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.


ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వాహనదారులకు సమయం, ఖర్చు ఆదా చేయడంతో పాటు సేవలను మరింత పారదర్శకంగా మార్చనుంది.


Post a Comment

أحدث أقدم