పినపాక నియోజకవర్గ ప్రజలు వర్షాకాలంలో వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి MLA పాయం వెంకటేశ్వర్లు




 మణుగూరు: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి:


వర్షాకాలంలో వాతావరణం తేమతో నిండిపోవడంతో బ్యాక్టీరియా వైరస్లు సులభంగా పెరిగే అవకాశం ఉంటుంది కావున ఈ క్రింది వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం వాటిలో ముఖ్యంగా 


  *1. వైరల్ ఫీవర్*

2. *టైఫాయిడ్*

3. *మలేరియా* 

4. *డయేరియా* 

5. *డెంగ్యూ*

6. *ఫ్లూ* 


 *వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు* 


👉 ఇల్లు చుట్టుపక్క పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి 


👉 పరిసరాలలో పిచ్చి మొక్కలు ఉండకుండా చూసుకోవాలి


👉 కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి


👉 వీలు ఉన్నంతవరకు బయట పదార్థాలు తినడం మానేయాలి 


👉 జ్వరం,దగ్గు,జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రిని సంప్రదించాలి


👉 ఆహారం సేవించే ముందు చేతులు తప్పనిసరిగా శుభ్రపరుచుకోవాలి

 

👉 వర్షాకాలంలో వచ్చిన జ్వరాలు మలేరియా డెంగ్యూ అయి ఉండవచ్చు కావున జ్వరం రెండు రోజుల కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా దగ్గరలో ఉన్న హాస్పిటల్ ను సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవాలి.

Post a Comment

కొత్తది పాతది