అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని వైద్య అధికారులను డాక్టర్స్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి మాట్లాడుతూ.. మనల్ని సృష్టించింది కంటికి కనపడని ఆ దేవుడైతే, మనకు ప్రాణం పోసేది మాత్రం కాపాడేది వైద్యులేనని వారినే ప్రతి ఒక్కరు దేవుళ్ళుగా భావిస్తారని మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా అశ్వాపురం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను ఉద్యోగి కైనా, ఏ వ్యక్తి కైనా వారు చేస్తున్న పనిలో ఒక రోజు సెలవు ఉంటుంది కానీ వైద్య వృత్తి నిర్వహించే వారికి ఎప్పటికీ కూడా సెలవు అనేది ఉండదని నిరంతరం ప్రాణాలు పోయడానికి మాత్రమే వైద్యులు కృషి చేస్తారని వారిని అందరూ దేవుళ్ళుగా భావిస్తారని అన్నారు. మండలంలో ప్రజలకు వైద్యులు అందిస్తున్న వైద్యం పట్ల ఎంతో మందిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన సందర్భాలు ఉన్నాయని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు వారు అందిస్తున్న వైద్య సేవలు ఎనలేనివని అదేవిధంగా ఉద్యోగులకు వారు చేస్తున్న వైద్య సేవలు మరువలేనివి అని అన్నారు ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి రమేష్ బాబు, మట్టా వీరభద్రారెడ్డి,ఎస్కే మోసిన్,గొల్లపల్లి నరేష్ కుమార్,దారావత్ హర్ష నాయక్,వేముల విజయ్,కుంజ జాను, కోలా శశికాంత్ తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి