ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.


 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను మొత్తం 2022 మంది ఓటర్లు కాగా అందులో పురుషులు 1068 మంది మహిళలు 954 మంది ఉన్నారని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు అందరూ 100% తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. 23 మండలాలకు గాను పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. రేపు కొత్తగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల నందు ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి సామాగ్రిని తీసుకొని అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు మరియు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ లైట్లు మరియు ఫ్యాన్లు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్లను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలోకి ఓటర్లను ఓటర్ రికగ్నైజేషన్ సెంటర్ ద్వారా నిశితంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం అత్యవసర వైద్య సహాయం అందించేందుకుగాను అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ అనంతరం అధికారులు పోలింగ్ సామాగ్రిని నిర్దేశిత పద్ధతి ప్రకారమే ప్యాకింగ్ చేసి నేరుగా నల్గొండ రిసెప్షన్ సెంటర్ కు చేరవేయాలి అన్నారు. నల్గొండ రిసెప్షన్ సెంటర్లో ఎవరికైతే డ్యూటీ వేసిన అధికారులు 27వ తారీకు ఉదయమే అక్కడికి చేరుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల లోపు ఎవరిని అనుమతించరాదని, అంటే ఇష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించటం.


 ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఎలక్షన్ సూపర్డెంట్ ధారా ప్రసాద్, ఎన్ఐసి అధికారి సుశీల్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

కొత్తది పాతది