పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: మండలంలోని సీతంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం ఇ .బయ్యారం ఎస్సై ఇమ్మిడి రాజ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు,స్వామివారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించినట్లు రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు బండారు నరేంద్ర ఆధ్వర్యంలో కమిటీ వారు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి