EB NEWS:
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు వరుసగా ఐదు రోజుల పాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. యూఎఫ్బియూ (UFBU) పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.
దీనికి ముందు సెప్టెంబర్ 26, 27 తేదీలు శని, ఆదివారాలు కావడంతో.. సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
2024 వేతన ఒప్పందం అనంతరం పెండింగ్‌లో ఉన్న 5 రోజుల పనిదినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని, అలాగే పనితీరు-అనుసంధాన ప్రోత్సాహకాలలో చేసిన మార్పులను రద్దు చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సమ్మె కారణంగా బ్యాంకు శాఖల్లో నగదు లావాదేవీలు, చెక్ క్లియరెన్స్, ఇతర ప్రత్యక్ష సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం వంటి డిజిటల్ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

