Raithu bharosa: రైతు భరోసా నిధులు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

G Rajashekar
By -
0



EB NEWS/ తెలంగాణ:


తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం తొలి విడతగా రూ.3,590 కోట్లను విడుదల చేశారు. ఈ కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.


రైతులు తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో లేదో సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ [https://www.rythubharosa.telangana.gov.in/ ను ఓపెన్ చేయాలి. అనంతరం మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి OTP నమోదు చేయాలి. తర్వాత “పేమెంట్ స్టేటస్” ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే, ఖాతాలో నిధులు జమ అయ్యాయా లేదా అనేది తెలుసుకోవచ్చు.


రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)