మణుగూరు రైల్వే స్టేషన్‌లో విషాదం… పెళ్లిరోజే రైల్వే ఉద్యోగి మృతి

G Rajashekar
By -
0



 EB NEWS/ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిగ్నల్ విభాగంలో ఈఎస్ఎం (ESM)గా పనిచేస్తున్న రంప నవీన్ (33) ప్రమాద వశత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.


అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, ఈరోజే నవీన్ పెళ్లిరోజు కావడం స్థానికులను మరింత కలిచివేసింది. మరోవైపు ఆయన భార్య ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మణుగూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)