భూర్గంపాడు: నకిరిపేట పాఠశాలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ

G Rajashekar
By -
0



 EB NEWS/బూర్గంపాడు:


బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు వంటి అంశాలను ఆయన పరిశీలించారు. 


ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాల వాతావరణం గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు మరింత శ్రద్ధతో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. 


పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు సరైన మార్గదర్శనం అందించాలని ఆయన తెలిపారు.


ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)