కన్నతండ్రే కిరాతకుడు.. ముగ్గురు చిన్నారులను చెరువులో ముంచి చంపిన దారుణం

G Rajashekar
By -
0



EB NEWS /కామారెడ్డి:


తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. నిన్న ఉదయం నుంచి అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు రాత్రికి స్థానిక పెద్ద చెరువులో విగతజీవులుగా కనిపించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.


మృతులు షీపత్ (8), ఆయాత్ (7), మరియం (5)గా గుర్తించారు. పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులు, స్థానికుల సహకారంతో వెతకగా పెద్ద చెరువులో వారి మృతదేహాలు బయటపడటం షాక్‌కు గురిచేసింది.


ఈ ఘటనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ చిన్నారుల తండ్రి ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతనే తన పిల్లలను హత్య చేసినట్టు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.


ఈ దారుణ ఘటనతో కామారెడ్డి పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. అమాయక చిన్నారుల మృతి స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


అయితే, తండ్రి ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడు? అనే విషయంపై పోలీసులు మరింత విచారణ చేపడుతున్నారు. 


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)