తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి కీలక నిర్ణయం

G Rajashekar
By -
0

 


EB NEWS/ భద్రాద్రి కొత్తగూడెం:


తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి కీలక నిర్ణయం తీసుకున్నారు. అనివార్య కారణాల నేపథ్యంలో తన బాధ్యతల నుంచి  దూరంగా ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.


సంస్థ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, తుడుం దెబ్బ ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఎప్పటికీ ఉంటుందని అలెం కోటి స్పష్టం చేశారు. తాను బాధ్యతల నుంచి దూరంగా ఉన్నా ఉద్యమ లక్ష్యాల సాధన కోసం ఎప్పటికీ అండగా ఉంటానని పేర్కొన్నారు.


అలెం కోటి నిర్ణయం నేపథ్యంలో తుడుం దెబ్బ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన త్వరలోనే మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్నదానిపై కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)