రజకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- బి.ఎస్.పి

 


కుల అహంకారంతో దాడులు జరిపి పాప మరణానికి కారకులైన శ్రీనివాస్ రెడ్డి ముఠాపై కఠినమైన చర్యలు తీసుకోవాలి


బహుజన రాజ్యం ఏర్పడితేనే బహుజన బిడ్డలకు రక్షణ ఉంటుంది


EB NEWS/ భద్రాచలం :

నాగర్ కర్నూల్ మల్లన్న జాతరలో జరిగిన గొడవలో కులం అహంకార ధోరణి గల రెడ్డీలు రజక కుటుంబానికి చెందిన ఒక కుటుంబం పై దాడి చేసారు ఆ దాడి కారణంగా రెండు నెలల పాప మరణించింది కుల అహంకారంతో రెడ్లు రజకులపై జరిపిన ఈ అమానుష దాడిని బీ ఎస్ పీ తీవ్రంగా ఖండిస్తుందని బీఎస్పీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు కొండా చరణ్ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న అందరిని రిమాండ్ చేయాలని, కుల అహంకారంతో దాడి చేసి పాప మరణానికి కారణమైన శ్రీనివాసరెడ్డి ముఠాపై మర్డర్ కేసు నమోదు చేసి కఠినమైన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీస్ యంత్రాంగం రెడ్డీలకు అనుకూలంగా ఉండటం దుర్మార్గమని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లకు తలవంచి, ఘటనకు కారణమైన నిందితులను ఏ ఒక్కరిని కూడా తప్పించే ప్రయత్నం చేయడానికి వీలులేదని, కేసును నీరు గారిచే పని చేస్తే బహుజన సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆదిపత్యకుల భావజాలం కలిగిన పార్టీలకు పదేపదే అధికారం ఇస్తే బహుజనులపై జరిగే అమానుష దాడులకు నిలువెత్తు సాక్ష్యం ఈ నాగర్ కర్నూల్ లో రజకులపై జరిగిన దాడి అని తెలిపారు. ఇప్పటికైనా బహుజన సమాజం మేల్కొనాలని ఈ ఘటనలు రజకులతో ఆగేవి కాదని మిగిలిన బహుజన కులాల దాకా తప్పకుండా వస్తుందన్నారు. బహుజన బిడ్డల రక్షణ కోసం బహుజన రాజ్యం ఏర్పాటు కోసం ఐక్యంగా ఉద్యమించాలని యావత్తు బహుజన సమాజానికి బీ ఎస్ పీ భద్రాచలం అసెంబ్లీ అధ్యక్షులు కొండా చరణ్ పిలుపునిచ్చారు.

Post a Comment

కొత్తది పాతది