పినపాకలో రోడ్డు ప్రమాదం – వ్యక్తికి తీవ్ర గాయాలు



EB NEWS/ పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపాలపట్నం ప్రధాన రహదారి వద్ద మంగళవారం  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  గోపాలరావుపేట గ్రామానికి చెందిన బండ గొర్ల మల్లేష్ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం, మల్లేష్ తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ప్రధాన రహదారి పక్కనే ఉన్న మర్రి చెట్టుకు వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతనికి తలకు తీవ్ర గాయమయ్యిందని స్థానికులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన మల్లేష్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

కొత్తది పాతది