రూ.1.82 కోట్ల మోసం కేసు… భద్రాద్రి జిల్లాలో ఇద్దరు ఎస్ఐలపై ఛీటింగ్ నమోదు

 


EB NEWS/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఫిబ్రవరి 24:


భద్రాద్రి జిల్లాలో ఇద్దరు ఎస్ఐలపై బూర్గంపాడు పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. గతంలో భద్రాచలం టౌన్ ఎస్ఐగా పనిచేసిన మహేష్‌తో పాటు, అతని తమ్ముడైన మరో ఎస్ఐ రాణా ప్రతాప్‌పై ఈ కేసు నమోదైంది.


వ్యాపారం పేరుతో 35 శాతం అధిక లాభాలు చెల్లిస్తామని నమ్మబలికి, కుమారి అనే మహిళ వద్ద నుంచి సుమారు రూ.1.82 కోట్ల మొత్తం తీసుకుని మోసగించారనే ఆరోపణలపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, అధిక లాభాల ఆశ చూపించి డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బూర్గంపాడు పోలీసులు ఇద్దరు ఎస్ఐలపై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.

Post a Comment

కొత్తది పాతది