పినపాకలో 2 వేల ఏళ్ల పురాతన గుహలు – పురావస్తు శాఖ తవ్వకాల్లో సంచలన అవశేషాలు

G Rajashekar
By -
0



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, పాండురంగాపురం గ్రామం సమీపంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఆరు ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 165 గుహలను గుర్తించినట్లు ఇన్‌చార్జ్ వికాస్ తెలిపారు. ప్రస్తుతం మూడు గుహల్లో తవ్వకాలు కొనసాగుతుండగా, ఎముకలు, కుండలు, ఎర్ర పూసలు వంటి అవశేషాలు లభించాయి.
ఇంకా కొన్ని ముఖ్యమైన అవశేషాలు లభించినప్పటికీ, పరిశోధన పూర్తయ్యే వరకు వాటి వివరాలను బహిర్గతం చేయలేమని అధికారులు వెల్లడించారు. లభించిన వస్తువులను పురావస్తు శాఖకు పంపించి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ గుహలు సుమారు 2 వేల ఏళ్ల నాటివని అంచనా వేస్తున్న అధికారులు, అప్పటి ప్రజల జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులు, మరణ కారణాలు వంటి కీలక విషయాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు.

ఈ తవ్వకాలతో ప్రాంతంలో చరిత్రపై స్థానికుల్లో ఆసక్తి మరింత పెరిగింది.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)