కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా మణుగూరులో బీఆర్‌ఎస్ నిరసన – ఉద్రిక్తత

G Rajashekar
By -
0

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కేసీఆర్‌పై సిట్ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు నాయకత్వంలో కార్యకర్తలు నల్లజెండాలతో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిరసన సమయంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం జరుగుతుందని సమాచారం అందడంతో కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేగా కాంతారావు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నిరసనను అడ్డుకోవద్దని హెచ్చరించారు.

పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు. దీంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. కేసీఆర్‌పై జరుగుతున్న సిట్ విచారణను తక్షణమే నిలిపివేయాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)