దుమ్ముగూడెంలో అక్రమ మద్యం విక్రయాలపై గ్రామస్తుల ఆందోళన – మహిళలు రోడ్డెక్కారు.

దుమ్ముగూడెం. ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలంలో అక్రమ మద్యం అమ్మకాలను వెంటనే ఆపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తున్న నిర్వాహకులతో మహిళల మధ్య వాగ్వివాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం గ్రామస్తులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామాల్లో శాంతి భద్రతలు, కుటుంబాల భద్రత దృష్ట్యా అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని వారు కోరారు.

Post a Comment

أحدث أقدم