పినపాక: మండల స్థాయి సీఎం కప్ క్రీడలు


పినపాక. ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలు 03-02-2026న AGHS ఏల్చిరెడ్డి పల్లి పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏడుళ్ల బయ్యారం, పినపాక, జానంపేట క్లస్టర్లలో నిర్వహించిన అండర్-18, అండర్-25 కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు ఈ మండల స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడాకారులు 3వ తేదీ  ఉదయం 9 గంటలకు హాజరు కావాలని  ఎంపీడీవో కే. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల చైర్మన్, మండల విద్యాశాఖ అధికారి, క్రీడల కన్వీనర్ కొమరం నాగయ్య, తహసిల్దార్ గోపాలకృష్ణ, సీఐ వెంకటేశ్వర్లు, హెచ్ఎం వీరాకుమారి, క్లస్టర్ ఇన్‌చార్జీలు సహకరిస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment

కొత్తది పాతది