భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని పగిడేరు గ్రామం దేశానికే ఆదర్శంగా మారుతోంది.
సింగరేణి సంస్థ 1980లో బొగ్గు నిక్షేపాల అన్వేషణలో భాగంగా వేసిన బోర్ల నుంచి
వేడి నీరు సహజంగా ఉబికి రావడం ఈ ప్రాంతానికి వరంగా మారింది.
ఈ వేడి నీటిని గ్రామస్తులు ఇంటి అవసరాలకు,
రైతులు సాగునీటికి వినియోగించుకుంటూ రెండు పంటలు పండిస్తున్నారు.
ఇదే వేడి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో
సింగరేణి సంస్థ దేశంలోనే తొలి 20 కిలోవాట్ల జియోథర్మల్ పవర్ ప్లాంట్ ను పగిడేరు గ్రామంలో నిర్మించింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్లాంట్‌ను విస్తరించేందుకు అధికారులు అధ్యయనం ప్రారంభించారు.
జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం,
మణుగూరు ప్రాంతంలో విస్తృత స్థాయిలో జియోథర్మల్ పవర్ ఉత్పత్తి కు అపార అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.
రవాణా, విద్యుత్ గ్రిడ్, మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉండటంతో
ఇక్కడ తక్కువ ఖర్చుతో పెద్ద స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
బొగ్గుతో కాలుష్యం కలిగించే సాధారణ థర్మల్ ప్లాంట్లకు భిన్నంగా
కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తి ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పరిశోధనలకు గ్రాంట్ కూడా కేటాయించింది.
ప్లాంట్ విస్తరణతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు,
ప్రాంత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ —
మూడూ కలిసి ఈ ప్రాంతం భవిష్యత్తు శక్తి కేంద్రంగా మార్చనున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి