బీజాపూర్‌లో మాజీ సర్పంచ్ హత్య.. మావోయిస్టుల కాల్పులు

 


బీజాపూర్ (చత్తీస్‌ఘడ్): ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


చత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రక్తపాతం సృష్టించారు. పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవర్ గట్ట గ్రామంలో మాజీ సర్పంచ్ మడకం బీమాను మావోయిస్టులు తుపాకీతో కాల్చి చంపారు.

తన పొలంలో పనులు చేస్తుండగా మడకం బీమాపై దాడి చేసిన మావోయిస్టులు, చుట్టుపక్కల రైతులు చూస్తుండగానే కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

గతంలో కూడా మావోయిస్టులు పలుమార్లు దాడులు చేసినప్పటికీ తప్పించుకున్న మడకం బీమా, ఈసారి వారి కాల్పులకు బలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Post a Comment

أحدث أقدم