టిజిఎస్పిఎఫ్ నూతన కార్యార్యాన్ని ప్రారంభించిన సివిల్ డైరెక్టర్

 



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మణుగూరు మండలం చిక్కుడుగుంట వద్ద బిటిపిఎస్‌లో టీజీఎస్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా సివిల్ డైరెక్టర్ అజయ్ కుమార్ హాజరై, బిటిపిఎస్ సిఈ బిచ్చన్నలతో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఎస్పిఎఫ్ భద్రతా సేవలు అభినందనీయమని కొనియాడారు. భద్రతను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఏ తిరుపతి, సూపర్డెంట్ ఇంజనీర్లు, ఎస్పీఎఫ్ ఎస్సైలు సుభాని, రమేష్ , ఓ అండ్ ఏం, ఇంజనీరింగ్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم