మణుగూరులో ఓటర్ల ప్రతిజ్ఞ.. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఓటింగ్‌కు సంకల్పం

G Rajashekar
By -
0

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నరేష్ ఆధ్వర్యంలో ఓటర్లతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుతూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికలను నిర్వహించేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని ఓటర్లు ప్రతిజ్ఞ చేశారు. జాతి, మత, కుల, వర్గ, భాషా భేదాలు లేదా ఎటువంటి ఒత్తిడులకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లలో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెరిగిందని అధికారులు తెలిపారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)