ప్రకృతిని కాపాడే దేవతలు.. ప్లాస్టిక్ రహిత మేడారం లక్ష్యం

G Rajashekar
By -
0



ములుగు జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


అరణ్యమే ఆలయంగా, ప్రకృతే దేవతలుగా భావించే మేడారం మహాజాతరను ఈసారి పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వనదేవతల సన్నిధిలో ప్రకృతి కలుషితం కాకూడదన్న సంకల్పంతో పోలీస్ శాఖ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, బాటిళ్ల వినియోగాన్ని అరికట్టి, వాటి స్థానంలో ఆకులతో తయారైన విస్తారాకుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. మేడారం లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ లో మహిళా సంఘాలు తయారు చేసిన విస్తారాకులను పరిశీలించిన ఎస్పీ, అందరి సహకారంతోనే ప్లాస్టిక్ రహిత మేడారం లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)