పినపాక: కబడ్డీ పోటీలను ప్రారంభించనున్న మంత్రులు శ్రీహరి, సీతక్క

G Rajashekar
By -
0

  


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా జనవరి 7 నుంచి 11 వరకు జాతీయస్థాయి అండర్-17 పురుషుల కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క ప్రధాన అతిథులుగా విచ్చేస్తున్నారు. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కూడా పాల్గొంటారు. ఈ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 30 రాష్ట్రాల జట్లతో  (జాతీయ కబడ్డీ ఫెడరేషన్) ఆధ్వర్యంలో జరుగుతాయి. మోరి టెక్ ఫౌండేషన్, కంది చారిటబుల్ ట్రస్ట్ స్పాన్సర్షిప్ లో జరగనున్నాయి.    గతంలో రాష్ట్రస్థాయి పోటీలు ఇక్కడ ఘనంగా జరిగాయి. మంత్రుల సందర్శనతో క్రీడా ఉత్సాహం మరింత పెరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)