అండర్ 17 కబడ్డీ.. వరుస విజయాలతో తెలంగాణ జట్టు (వీడియో)

 



పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 69వ జాతీయస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలలో నాల్గవ రోజు తెలంగాణ జట్టు కేరళ పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.

అభిమానులు భారీ సంఖ్యలో హాజరై, క్రీడాకారులకు ఉత్సాహాన్ని నింపారు. వరుస విజయాలతో   తెలంగాణ టీమ్ దూసుకుపోతుంది.  ఈ విజయంతో  అభిమానాల సంబరాలతో క్రీడా ప్రాంగణం దద్దరిల్లింది.

ఫైనల్ మ్యాచ్లో కూడా తెలంగాణ జట్టు విజయం సాధించాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన ఆట ప్రదర్శనతో తెలంగాణ జట్టు విజయకేతనం ముగిస్తుంది. ఈ మ్యాచ్ చూస్తుంటే అభిమానుల ఆనందానికి హద్దులు లేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేపు ఆదివారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. క్రీడా అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. 

Post a Comment

أحدث أقدم