మణుగూరులో నేషనల్ ఓటర్స్ డే ర్యాలీ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎమ్మెల్యే పిలుపు

G Rajashekar
By -
0

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మణుగూరు పట్టణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తహశీల్దార్ నరేష్, ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుతూ స్వేచ్ఛయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికలను నిలబెట్టాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించాలని ఆయన సూచించారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)