మణుగూరులో మినీ మేడారం జాతర ఘనంగా ప్రారంభం

G Rajashekar
By -
0

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తొగ్గుడెంలో మినీ మేడారం మహాజాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు చేరుకోగా, గురువారం సమ్మక్క అమ్మవారు గద్దెకు రానున్నారు. శుక్రవారం భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం శనివారం సమ్మక్క–సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. భక్తులతో ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కళకళలాడుతోంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)