పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానంలో ఐదు రోజులుగా కొనసాగుతున్న 69వ జాతీయ కబడ్డీ పోటీల్లో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగింది.
ఈ మ్యాచ్‌లో తెలంగాణ – ఉత్తరప్రదేశ్ జట్లు తలపడ్డాయి. చివరికి ఉత్తరప్రదేశ్ జట్టు 33 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ను తిలకించేందుకు కబడ్డీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ జట్టు పరాజయంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.

إرسال تعليق