బాధిత కుటుంబానికి వెంకట కృష్ణయ్య ఫౌండేషన్ 5వేల ఆర్థిక సహాయం

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 మహా:మండల పరిధి జానంపేట గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు ఇటీవలే తన గుడిసెకు నిప్పు అంటుకొని ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం విధితమే. దీనితో మృతుడు నాగేశ్వరరావు భార్య సరోజిని, నలుగురు సంతానం అంజలి,అక్షిత, ప్రశాంతి, గాయత్రి లు అనాధలుగా మారారు. ఈ విషయం తెలుసుకున్న మహర్షి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తోలం శ్రీనివాసరావు ఆదివారం పైడిపల్లి వెంకట కృష్ణయ్య ఫౌండేషన్ నిర్వాహకులు, హైకోర్టు న్యాయవాది పైడిపల్లి చైతన్య దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివాసి కుటుంబం, ఐదుగురు అనాధలుగా మారడంతో చలించిన పైడిపల్లి వెంకట కృష్ణయ్య ఫౌండేషన్ నిర్వాహకులు, హైకోర్టు న్యాయవాది పైడిపల్లి చైతన్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు.అలాగే వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరి కొంతమంది దాతలు స్పందించి మృతుడు నాగేశ్వరరావు కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విష్ణు, చందు, సతీష్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم