- తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్న ఎస్ఐ సురేష్
పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలంలో ఓ పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల బాలికకు ఓ యువకుడు మాయ మాటలు చెప్పి, భయపెట్టించి గర్భవతి చేసిన యువకుడిపై పోలీసులు ఫోక్సోకేసు నమోదు చేశారు. గురువారం ఈ బయ్యారం ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం పినపాక మండలం లో ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల మైనర్ బాలికను మాయమాటలు చెప్పి, భయపెట్టించి పినపాక మండలానికి చెందిన వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక ప్రస్తుతం ఆ బాలిక గర్భవతి అయిందన్నారు. ఈ విషయం ఆలస్యంగా బాలిక తల్లికి తెలియడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
.jpg)
إرسال تعليق