ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

G Rajashekar
By -
0



భద్రాద్రి కొత్తగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచనలు జారీ చేశారు.జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.


 భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు – భూసమస్యల పరిష్కారం కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రజావాణి నిర్వహిస్తారు.


 కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలు – భూసమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ప్రజావాణి నిర్వహిస్తారు.


కావున జిల్లా ప్రజలందరూ తమ డివిజన్ పరిధి ప్రకారం సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించి, భూసమస్యల పరిష్కారానికి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో అధిక వర్షపాతం ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)