వైద్య సేవలపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రశంసలు
EB NEWS/మణుగూరు:
మణుగూరు మండలంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌డీఎస్ (హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ) సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వlర్లు ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రి పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, సిబ్బంది పనితీరు వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. రోగులకు అందుతున్న సేవల నాణ్యతపై అధికారులను ప్రశ్నిస్తూ, మరింత మెరుగుదలకు సూచనలు చేశారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వారి కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు తాను కట్టుబడి ఉన్నానని, ప్రభుత్వ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎం. గౌరీ ప్రసాద్, ఎంఆర్ఓ నరేష్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, మైనారిటీ అధ్యక్షులు రహీం పాషా, సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, లంక మల్లారం సర్పంచ్ పూణెం రమేష్, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


