ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
తెలంగాణ , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: ప్రయాణికుల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు నడిపే సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్లు వినియోగించడాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేటి (సెప్టెంబర్ 1) నుంచి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనుంది. ఎంపిక చేసిన 11 డిపోల పరిధిలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలవుతుంది. గ్రేటర్ జోన్‌లోని ఫరూక్‌నగర్, కూకట్‌పల్లి డిపోలు ఈ జాబితాలో ఉన్నాయి.
إرسال تعليق