بلا عنوان

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం  పేదవారి సొంతింటి కల నెరవేరాల నే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. 


అర్హులైన లబ్ధిదారులను గుర్తించే పనిలో ఉంది. 


అయితే ఇప్పటికే మండలానికి ఒక పంచాయతీ చొప్పున కొన్ని ఇల్లు కేటాయించి... కట్టించే పనిలో ఉంది. 


కేటగిరీల వారిగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్తోంది. 


ఇంటి స్థలం లేని వారికి, స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది.


నిజమైన అర్హులను గుర్తించడానికి గ్రామాల్లో ప్రభుత్వం సర్వేలు కూడా నిర్వహిస్తుంది. 


కొన్ని ప్రాంతాలలో అర్హులకు ఇల్లులు కేటాయించకుండా  అనర్హులకు ఇస్తున్నారని ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.


అయితే ప్రభుత్వం మాత్రం నిరుపేదలకు అర్హత కలిగిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కలెక్టర్లకు సూచించింది. 


రికమండేషన్లు చల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైనా లంచం అడిగితే కంప్లైంట్ చేయాలని సూచించింది.


 పారదర్శకంగా ఇండ్ల పంపిణీ జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  చెబుతోంది.













Post a Comment

أحدث أقدم